నాకు బిడ్డ పుడితే చైతన్య మాష్టర్ పేరు పెట్టుకుంటా...
on Nov 10, 2025
.webp)
బుల్లితెర మీద ఢీ డాన్స్ షోలో చైతన్య మాష్టర్ ఒక సంచలనం. ఆయన శిష్యుడే రాజు. అలాంటి చైతన్య మాష్టర్ గురించి రాజు ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు. "రాజు అసలు నువ్వు డాన్సర్ ఎలా అయ్యావు. ఢీ షోలో ఛాన్స్ ఎలా వచ్చింది" అని అడిగింది హోస్ట్. "నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. స్టేజి మీద వేయాలంటే భయం కానీ టెన్త్ క్లాస్ లో డేర్ చేసి స్టేజి మీద వేసాను. మా టీచర్స్ అంతా పొగిడారు. తిట్టేవాళ్ళు పొగిడేసరికి నేను అదే డాన్స్ ని వినాయక చవితిలో వేసాను. అప్పుడు చైతన్య మాష్టర్ చూసి బాగా వేస్తున్నావ్ అని తనతో పాటు సూర్యాపేట తీసుకెళ్లారు. ఆయనకు నేను ఎందుకు నచ్చాను అంటే నేను మినిమం 70 సాంగ్స్ నేర్చుకున్నా మూడు నెలల్లో అలాగే బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేస్తూ మిగతా సాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. మాష్టర్ అది చూసి నన్ను ఢీ షోకి తీసుకెళ్లారు. ఐతే అప్పటికి నాకు 104 ఫీవర్ ఉంది.
ఆ విషయం చెప్తే మాష్టర్ నన్ను పక్కన పెట్టేస్తాడేమో అని భయమేసింది. తర్వాత ఆయన నన్ను చూసి ఫీవర్ గా ఉంటె ఎందుకు చెప్పలేదు అన్నారు. మీరే తీసేస్తారేమో అని భయపడ్డా అని చెప్పాను. ఆ తర్వాత ఎగ్జామ్స్ అని చెప్పి మా ఇంటికి వెళ్లాను. ఆ తర్వాత చైతన్య మాష్టర్ ఫోన్ చేసి నేను చదివిస్తా నువ్వొచ్చాయి అని చెప్పాడు. ఆ తర్వాత రెండేళ్లు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేసాను కంటెస్టెంట్ అయ్యాను టైటిల్ కొట్టాను. చైతన్య మాష్టర్ చనిపోయారు అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఎందుకంటే రెండు నిమిషాల ముందు నాకే ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పారు. వాళ్లకు అప్పులు ఉన్నాయన్న విషయం నాకు ముందు నుంచి తెలుసు. అప్పులు నెమ్మదిగా తీరుద్దాం మీరు టెన్షన్ పడకుండా హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పా. అంతే వెంటనే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా చైతన్య మాష్టర్ ఇంట్లో ఉరేసుకున్నారని చెప్పాడు. నాకు షాక్. మా బాండింగ్ ఎలా ఉంటుంది అంటే నా పేరును ఆయన పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఏడాది పాటు నేను బయటకు రాలేకపోయాను. ఒక్కసారి చైతన్య మాష్టర్ కనిపిస్తే హగ్ చేసుకుని మిస్ యు మాష్టర్ అంటాను. లాస్ట్ లో ఒక్క మాట డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్ టైటిల్ కొట్టు అన్నారు కొట్టాను. నేను పెళ్లి చేసుకుంటే నాకు బిడ్డ పుడితే చైతన్య మాష్టర్ పేరు పెట్టుకుంటా" అని చెప్పాడు ఢీ 10 రాజు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



